Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లా కుర్రోళ్లకు వాతలు పెట్టిన భారత్.. విరాట్‌.. శిఖర ధవాన్ రికార్డులు

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. దీంతో చాంపియన్స్ ట్

బంగ్లా కుర్రోళ్లకు వాతలు పెట్టిన భారత్.. విరాట్‌.. శిఖర ధవాన్ రికార్డులు
, శుక్రవారం, 16 జూన్ 2017 (10:12 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ కోసం చిరకాల ప్రత్యర్థులైన పాకిస్థాన్, భారత్‌లు తలపడనున్నాయి. 
 
ఇదిలావుండగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేసింది. వన్డేల్లో వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. బంగ్లాతో మ్యాచ్‌లో షబ్బీర్‌ వేసిన 38వ ఓవర్లో సింగిల్‌ తీసిన అతను ఈ మైలురాయిని దాటాడు. దాంతో, 175 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్న విరాట్‌.. దక్షిణాఫ్రికా సారథి ఏబీ డివిల్లీర్స్‌ (182 ఇన్నింగ్స్‌లు)ను వెనక్కినెట్టాడు. సౌరవ్‌ గంగూలీ (200 ఇన్నింగ్స్‌లు), సచిన్‌ టెండూల్కర్‌ (210 ఇన్నింగ్స్‌లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.
 
అలాగే, చాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శిఖర్‌ ధవన్‌ రికార్డుకెక్కాడు. ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో 680 పరుగులు చేసిన ధవన్‌.. భారత మాజీ కెప్టెన్‌ గంగూలీ (665)ని అధిగమించాడు. అలాగే.. వరుసగా రెండు ఎడిషన్లలో 300 పైచిలుకు స్కోరు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2013లో 363 రన్స్‌తో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచిన శిఖర్‌ ఈసారి కూడా 317 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక, ఐసీసీ వన్డే ఈవెంట్లలో వేగంగా (16 ఇన్నింగ్స్‌) వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగాను రికార్డు సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ.... కుక్క ఎవరు?... పులి ఎవరు?