Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : టాస్ గెలిచిన కివీస్ - భారత్ బ్యాటింగ్ - గిల్ ఔట్

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (14:47 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నామమాత్రమైన మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, భారత్ ఏకంగా 13వ సారి టాస్ ఓడిపోయింది. ఇందులో రోహిత్ శర్మ ఏకంగా పది సార్లు టాస్ ఓడిపోయారు. వన్డేల్లో ఇలా అత్యధికసార్లు కోల్పోయిన మూడో సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు. మరోవైపు, భారత్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తన వ్యక్తిగత స్కోరు 2 పరుగుల వద్ద గిల్ కివీస్ బౌలర్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. 
 
రోహిత్ శర్మ కంటే బ్రియాన్ లారా (12 సార్లు), పీటర్ బోరెన్ (11 సార్లు) టాస్ ఓడిపోయారు. భారత స్టార్ అటగాడు విరాట్ కోహ్లికి ఇది 300వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఓడిన జట్టు మాత్రం సౌతాఫ్రికాతో ఆడుతుంది. 
 
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రోహిత్ శర్మ, గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు చోటుకల్పించారు. 
 
అలాగే, కివీస్ జట్టులో విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టాల్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్, కేల్ జేమీసన్, విలియమ్ ఓరూర్క్, మ్యాచ్ హెన్రీలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments