దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే, పాకిస్థాన్ జట్టు 34 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‍లో పాకిస్థాన్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, జట్టు ప్రస్తుతం ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 13 ఓవర్లలో 59 పరుగులు చేసింది. ఓపెనర్ బాబర్ అజామ్ 23, ఇమామ్ ఉల్ హక్ 10 చొప్పున పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బాబర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, అక్షర్ పటేల్ మెరుపు వేగంతో స్పందించి వికెట్లను నేలకూల్చడంతో ఇమామ్ ఉల్ హక్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో సౌద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్‌లు చేపట్టారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిజ్వాన్ 46 పరుగులు చేసి క్లీనౌ బౌల్డ్ అయ్యాడు. షకీల్ మాత్రం 58 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అయితే, షకీల్ ఇచ్చిన సులభతరమైన క్యాచ్‌ను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో మహ్మద్ షమీ చెత్త రికార్డును నెలకొల్పాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సుధీర్ఘమైన ఓవర్ వేసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. తొలి ఓవర్‌లో ఐదు వైడ్ బాల్స్ వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. భారత్ తరపున ఒక ఓవర్‌లో ఇన్ని బంతులు వేసిన వారి జాబితాలో అంతకుముందు జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉన్నారు.
ఇక జహీర్ అయితే ఆరు సందర్భాల్లో ఓవర్‌కు పదేసి బంతులు చొప్పున విరిసారు. ఈ రికార్డులో అగ్రస్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన హసిబుల్ హుస్సేన్, జింబాబ్వేకు చెందిన తినస్యే పన్యాంగరలు ఉన్నారు. వీరిద్దరూ ఓవర్‌లో 13 బంతులు విసిరారు.
ఇదిలావుంటే షమీకి గాయం తిరగెట్టిందా అనే సందేహం వ్యక్తమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్ బౌలింగ్ సందర్భంగా కుడికాలిలో కొంత సమస్య తలెత్తింది. దీంతో ఓ ఓవర్ పూర్తి చేసి మైదానాన్నీ విడాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఐదు వికెట్లు తీసిన షమీకి ఈ మ్యాచ్‌లో గాయం తిరగబెట్టిందా? అనే సందేహం ఉత్పన్నమైంది.