పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం అమిత ఆతృతగా ఎదురు చూస్తుంది. ఈ టోర్నీలో భారత్.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్లు తేడాతో విజయం సాధించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.
అదేసమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెమీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో ఎంతో కీలకం. ముఖ్యంగా, పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా మిగులుతాయి. దీంతో పాక్ కుర్రోళ్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. అలాగే, తొలి మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ ఆటతీరు విమర్శలపాలైంది. 320 పరుగుల ఛేదనలో 90 బంతుల్లో కేవలం 64 పరుగులే చేశాడు. దీంతో అతనిపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశఆరు.
మరోవైపు, భారత్‌పై ఆడిన 8 మ్యాచ్‌లలో బాబర్ 218 పరుగులే చేయగలిగాడు. ఇక టీమిండియాపై చెలరేగే ఓపెనర్ ఫఖర్ జమాన్ ఈ టోర్నీకి దూరం కావడం పాక్ జట్టుకు పెద్ద లోటుగా చెప్పొచ్చు. పాక్ బ్యాటింగ్‌లో రిజ్వాన్, సల్మాన్ ఆఘా, సాద్ షకీల్ కీలకం. బౌలింగ్‌లో పేసర్లు షహీన్ షా, నసీమ్ షా, రౌఫ్ ఆరంభంలో భారత్ బ్యాటర్లను కట్టడి చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు. స్పిన్‌లో అబ్రాల్ అహ్మద్ ఆకట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు, పరుగులు, వికెట్లు, అత్యధిక స్కోరు, గెలుపోటములు వంటి వివరాలు గురించి తెలుసుకుందాం.
భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 135 వన్డేలు జరిగాయి పాకిస్థాన్ 73 మ్యాచ్‌లలో విజయం సాధించింది. అత్యధిక స్కోరు రూ.356/9, విశాఖపట్టణంలో 2005 ఏప్రిల్ జరిగిన మ్యాచ్‌లో భారత్ ఈ స్కోరు సాధించింది. 2023 సెప్టెంబరు 10న కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2 వికెట్లు నష్టానికి 356 పరుగులు చేసింది. 1978 అక్టోబరు 13న సియోల్ కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 34.2 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌట్ అయింది. 2023 సెప్టెంబరు 10వ తేదీన పాకిస్థాన్‌పై భారత్ 228 పరగులు భారీ తేడాతో విజయం సాధించింది.
తుది జట్ల అంచనా..
భారత్ : రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, హార్ధిక్, జడేజా, అక్షర్ పటేల్, హర్షిత్, షమీ, కుల్దీప్.
పాకిస్థాన్ : ఇమామ్ ఉల్ హక్, బాబర్, సాద్ షకీల్, రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ ఆఘా, తహీర్, ఖుష్టిల్ షా, షహీన్ షా, నసీమ్ షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.