Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచి టెస్ట్ మ్యాచ్ : టాస్ గెలిచిన ఇంగ్లండ్... భారత్ బౌలింగ్

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (10:08 IST)
ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభమైంది. ఈ టెస్ట మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బౌలింగ్‌కు దిగింది. అయితే, రాజ్‌కోట్‌ టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు ధ్రువ్ జురెల్‌లు టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేయగా, రాంచీ మ్యాచ్‌లో నయా పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ కుర్రోడికి జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ క్యాప్‌ను అందించి అభినందలు తెలిపాడు. జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో ఆకాశ్ దీప్‌కు అవకాశం లభించింది. 
 
కాగా, టాస్ ఓడిపోవడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, తాను టాస్ గెలిచివుంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. పిచ్‌పై కొంచెం పొడిగా ఉండటంతో పాటు పగుళ్లు కనిపిస్తున్నాయన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో బాగానే రాణించామన్నాడు. ఈ మ్యాచ్‌లోనే అదే తరహా ప్రదర్శన చేసి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, ప్రతి ఒక్క ఆటగాడు బాధ్యతాయుతంగా, సవాలుగా తీసుకుని ఆడుతున్నారన్నారు. వారి ప్రతిభ, నైపుణ్యాలపై తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. ఆకాశ్ దీప్ అరంగేట్రం చేస్తున్నాడని, జట్టులో ఇదొక్కటే మార్పు అని చెప్పాడు. 
 
ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
భారత జట్టు : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, గిల్, రజత్ పటీదార్. సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, ఆర్.అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్. 
 
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, అలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)

సారధి స్టూడియోలో భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ ఏం చెప్పబోతోంది తెలుసా !

తర్వాతి కథనం
Show comments