Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

"అకాయ్" పేరుకు అర్థం ఏమిటి.. నెట్టింట రచ్చ రచ్చ

Advertiesment
Anushka Sharma

సెల్వి

, బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (13:53 IST)
Anushka Sharma
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొడుకు "అకాయ్" పేరుకు అర్థం ఏమిటనేది చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే "భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి" అని చెబుతున్నారు. 
 
ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు. అయితే తమ బాబుకి అకాయ్‌ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా ధ్రువీకరించలేదనే విషయం తెలిసిందే. 
 
విరాట్ కోహ్లీ- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు రెండవ సంతానానికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డ పుట్టాడంటూ ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీకి జూనియర్ వచ్చేశాడోచ్... పండంటి బాబుకు జన్మనిచ్చిన అనుష్క