Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ టీ20లో బంగ్లాదేశ్ చిత్తు.. భారత్ ఘన విజయం

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (10:04 IST)
హైదరాదాద్ నగరంలో శనివారం రాత్రి పర్యాటక బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ళు దుమ్ములేపారు. భారత జట్టు ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించింది. 
 
ఆ తర్వాత భారీ విజయ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ విజయంతో భారత్ ఒక ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.
 
టీ20 ఫార్మాట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బద్దలు కొట్టింది.
 
బంగ్లాపై అత్యధిక పరుగుల తేడాతో విజయాలు... భారత్ -133 పరుగులు (2024), దక్షిణాఫ్రికా 104 పరుగులు (2022), పాకిస్థాన్ - 102 పరుగులు (2008), భారత్ - 86 పరుగులు (2024), దక్షిణాఫ్రికా- 83 పరుగుల(2017)తో భారత్ గెలుపొందింది. 
 
కాగా, హైదరాబాద్ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ భారత బ్యాటర్లు చెలరేగారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. 
 
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ - సంజూ శాంసన్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత చివరిలో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments