Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా శుభ సమయం ఎప్పుడు.. సర్వార్థ సిద్ధి యోగం కూడా..?

Dussera

సెల్వి

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:34 IST)
Dussera
దసరా శుభ సమయం గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 12న ఉదయం 10:58 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 13, 2024న ఉదయం 09:08 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం దసరా 12 అక్టోబర్ 2024న జరుపుకుంటారు. 
 
ఈసారి దసరా రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం కూడా ఏర్పడుతున్నాయి. దసరా రోజున పూజ సమయంలో మీరు 'శ్రీ రామచంద్రాయ నమః' లేదా 'రామే నమః' అనే మంత్రాన్ని జపించవచ్చు. 
 
దసరా రోజు జమ్మిని పూజించాలి. ఇది బ్లాక్ మ్యాజిక్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంటిలో పాజిటివ్‌ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. దసరా పండుగ రోజున జమ్మిని పూజించడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. ఇంట్లో కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. 
 
అంతేకాకుండా ఎనలేని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా మహాభారత కాలంలో పాండవులు కూడా జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాచి విజయం సాధించారని చెబుతారు.
 
సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత జమ్మి ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున జరిగే జమ్మి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-10-2024 శుక్రవారం దినఫలితాలు : ధనలాభం.. ఖర్చులు విపరీతం...