పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలోని బొగ్గు గనిలోని వసతిగృహాల్లోకి సాయుధులు చొరబడ్డారు. గనిలోని ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతిచెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఇస్లామాబాద్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఈ ఘటన తర్వాత పాక్ లోని ప్రధాన పట్టణ, నగరాలలో భద్రతను పెంచారు.. విదేశీయులు ఉండే ప్రాంతాలలో ఆర్మీ బలగాలు పహారా కాస్తున్నాయి.