టీమిండియాకు మరో షాక్ : టెస్ట్ సిరీస్ నుంచి షమీ దూరం

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (15:59 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెస్ట్ సిరీస్ నుంచి భారత పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో శనివారం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాట్ కమిన్స్‌ వేసిన బౌన్సర్ షమీ కుడి చేతికి తగలడంతో అతను గాయపడ్డాడు. దీంతో ఆట మధ్యలోనే రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. 
 
తీవ్ర నొప్పితో బాధపడిన షమీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ నిర్వహించారు. తన చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు డాక్టర్లు తెలపడంతో షమీ సిరీస్‌లోని ఆఖరి మూడు టెస్టులకు దూరంకానున్నాడు. 
 
'షమీ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అందుకే అతడు క్రీజులో బ్యాట్‌ను పట్టుకొని పైకి ఎత్తలేకపోయాడు. గాయం తీవ్రత పెద్దదేనని' షమీ సన్నిహిత వర్గాల సమాచారం. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు

బంగారు పీఠం తప్పిపోయింది.. ఉన్ని కృష్ణన్ ఇంట్లో దొరికింది.. అసలేం జరుగుతోంది?

Election : అక్టోబర్ 9 నుండి 31 జిల్లాల్లో పోలింగ్- మార్గదర్శకాలు జారీ

నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎలాంటివారో తెలుసా?: సీఎం చంద్రబాబు (video)

Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

మాజీ ప్రియురాలిని మరవలేకపోతున్నా.. ఆర్థిక ఒత్తిడిలో కూడా ఉన్నాను.. డైనింగ్ ఏరియాలో ఉరేసుకుని..?

Chiru: భారతీయుడికి గర్వకారణమైన క్షణం : చిరంజీవి, మోహన్ లాల్, నిఖిల్

Prabhas : రాజా సాబ్ లో సంజయ్ దత్ హైలైట్ కాబోతున్నాడా..

Ram Charan :పెద్ది నుంచి రామ్ చరణ్ బ్రాండ్ న్యూ మాస్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments