Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ టెస్ట్ : ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేసిన భారత బ్యాట్స్‌మెన్లు - 622/7 డిక్లేర్డ్

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (12:32 IST)
ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్లు ఓ ఆట ఆడుకున్నారు. కంగారులకు పట్టపగలు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు సెంచరీలతో కదం తొక్కగా, మిగిలినవారు తమవంతు సాయం చేశారు. ఫలితంగా భారత తన తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగుల చేసి డిక్లేర్ చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయంతెల్సిందే. ఆ తర్వాత భారత ఓపెనర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా, రిషబ్ పంత్‌లు నిలకడగా రాణించారు. ఈ క్రమంలో పుజారా 193, పంత్ 159 (నాటౌట్) పరుగులతో రాణించడంతో భారత్ అలవోకగా 600 పరుగుల మార్క్ చేరుకుంది. 
 
లంచ్ విరామం తర్వాత పంత్‌తో పాటు జడేజా క్రీజులో దూకుడుగా ఆడాడు. జట్టు స్కోరు 418 పరుగుల వద్ద పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా 622 స్కోరు వద్ద ఔటయ్యాడు. సహనంతో బ్యాటింగ్ చేస్తూ మరో ఎండ్‌లో పంత్‌కు సహకరించాడు. కమిన్స్ వేసిన 164వ ఓవర్లో జడ్డూ ఒక్కడే ఏకంగా నాలుగు ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టాడు. టీ20 క్రికెట్ తరహాలోనే వారిద్దరి బ్యాటింగ్ సాగింది. 
 
ఈ క్రమంలో జట్టు స్కోరు 622 పరుగులకు చేరుకోగానే కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా పది పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు హర్రీస్ (19), ఖవాజా (5) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments