Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ : క్రికెట్ పసికూనలను ఓ ఆటాడుకున్న ధవాన్ - విజయ్

బెంగుళూరు వేదికగా క్రికెట్ పసికూన ఆప్ఘనిస్తాన్ జట్టుతో భారత క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఏమాత్రం అనుభవంలేని ఆప్ఘాన్ బౌలర్లను ఓ ఆట ఆడ

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (17:50 IST)
బెంగుళూరు వేదికగా క్రికెట్ పసికూన ఆప్ఘనిస్తాన్ జట్టుతో భారత క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఏమాత్రం అనుభవంలేని ఆప్ఘాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధవాన్ బ్యాట్‌కు పని చెప్పడంతో తొలి సెషన్‌లో సెంచరీ సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది.
 
టెస్ట్ హోదా సాధించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఓపెనర్లుగా బరిలోకి దిగిన ధవాన్ - విజయ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
ముఖ్యంగా, తొలి సెషన్‌లో ధవాన్ సెంచరీ పూర్తి చేయడం గమనార్హం. 96 బంతులను ఎదుర్కొన్న ధావన్ 3 సిక్సర్లు, 19 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేసి, యమిన్ అహ్మద్ జాయ్ బౌలింగ్‌లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌లో మరెవరూ సాధించలేని ఘనతను సాధించాడు. 
 
ఒక టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ రోజు లంచ్ సమయానికంటే ముందే సెంచరీ కొట్టిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా ధావన్ అవతరించాడు. లంచ్ విరామానికి ధావన్ 104 పరుగులు సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సెహ్వాగ్ పేరిట ఉంది. 2006లో సెయింట్ లూసియాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరూ 99 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత మురళీ విజయ్ కూడా 153 బంతుల్లో ఎదుర్కొని 105 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. అదేవిధంగా రాహుల్ 54, పుజారా 35, రహానే 10 చొప్పున రన్స్ చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజ్‌లో కార్తీక్ (3), పాండ్యా (4)లు ఉన్నారు. ఆఫ్ఘాన్ బౌలర్లల అహ్మద్ జాయ్ రెండు వికెట్లు తీయగా, వాఫదర్, రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మాన్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments