Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికాగో కేంద్రంగా సెక్స్ స్కాండల్.. టాలీవుడ్ హీరోయిన్స్ అలా వెళ్లి...?

అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న సెక్స్ స్కాండల్ చికాకో కేంద్రంగా నడుస్తోంది. ఈ స్కామ్‌ను అమెరికా పోలీసులు బట్టబయలు చేశారు. టాలీవుడ్ హీరోయిన్స్‌ను సినిమా షూటింగ్‌లంటూ తాత్కాలిక వ

Advertiesment
చికాగో కేంద్రంగా సెక్స్ స్కాండల్.. టాలీవుడ్ హీరోయిన్స్ అలా వెళ్లి...?
, గురువారం, 14 జూన్ 2018 (11:29 IST)
అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న సెక్స్ స్కాండల్ చికాకో కేంద్రంగా నడుస్తోంది. ఈ స్కామ్‌ను అమెరికా పోలీసులు బట్టబయలు చేశారు. టాలీవుడ్ హీరోయిన్స్‌ను సినిమా షూటింగ్‌లంటూ తాత్కాలిక వీసాపై అమెరికాకు రప్పించడం.. వారిని ఖరీదైన హోటళ్లలో వుంచి.. విటులను పంపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఇందులో భాగంగా ఎన్నారై మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రలు సూత్రధారులుగా అమెరికా పోలీసులు పేర్కొన్నారు. గతకొంత కాలంగా ఈ రాకెట్ నడుస్తోందని, హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు. 
 
ఇక ఈ స్కామ్‌లో అరెస్టయిన కిషన్ మోగుమూడి (34) పలు తెలుగు సినిమాలకు కో-నిర్మాతలుగా పనిచేశాడు. తాత్కాలిక వీసాలపై చికాగో వచ్చిన ఐదు తారామణులు... అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ఈ తంతు జరిపారని.. ఆపై ఖరీదైన హోటళ్లలో సెక్స్ స్కాండల్ నడిపారని.. డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ హోటళ్లలో ఇది జరిగేదని పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ కోసమంటూ పక్కకొచ్చి.. నడుము తాకాడు.. నుష్రత్ భరూచా