Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్ పర్యటనకు భారత్ టూర్ షెడ్యూల్... రింకూ, జితేశ్‌లకు చోటు?

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (09:42 IST)
భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై - ఆగస్టు నెలల్లో సాగే ఈ క్రికెట్ టూర్‌లో ఇరు జట్లూ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో తలపడతాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌‍ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి విడుదల చేసింది. 
 
జూలై 12 నుంచి 16వ తేదీ వరకు డొమినికాలోని విండర్స్ పార్కులో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. జూలై 20-24 మధ్య ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌పార్క్‌ ఓవల్ మైదానంలో రెండో టెస్టును నిర్వహిస్తారు. జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
మరోపు, ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు వెస్టిండిస్‌లో పర్యటించే టీమిండియా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. పొట్టి ఫార్మాట్లో యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. హార్దిక్ నేతృత్వంలో రాబోయే టీ20 వరల్డ్ కప్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. 
 
అందుకే ఐపీఎల్‌లో చూపిన ప్రదర్శన కారణంగా రింకూ సింగ్, జితేశ్, యశస్వీ జైస్వాల్ ఎంపిక జరగ వచ్చని సమాచారం. కరీబియన్లతో జరిగే రెండు టెస్టుల ద్వారా భారత జట్టు కొత్త డబ్ల్యూటీసీ సీజన్ ప్రారంభంకానుంది. ఇటీవలి చేదు ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జట్టులోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments