Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : భారత్‌ను కట్టడి చేసిన కివీస్ బౌలర్లు.. స్కోరు ఎంతంటే?

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (18:36 IST)
చాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ ఆదిలోనే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లలో కూడా పరుగులు చేయలేక పోయారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి ఐదు వికెట్లు దక్కాయి. 
 
ఈ చాంపియన్స్ ట్రోఫీలో గ్రూపు-ఏ విభాగంలో ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీ చేయగా, అక్షర్ పటేల్, హార్ధిక్ ప్యాండ్యాలు మ్యాచ్ ఆఖరులో ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు మంచి శుభారంభం దక్కలేదు. కివీస్ పేసర్ల ధాటికి కేవలం 30 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ (15), గిల్ (2), కోహ్లి (11) చొప్పున పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. అయితే, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల జోడీ కుదురుగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయ్యర్ 98 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 61 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశారు. 
 
హార్దిక్ పాండ్యా (45), కేఎల్ రాహుల్ (23) కూడా మ్యాచ్ ఆఖరులో ఫర్వాలేదనిపించారు. దీంతో జట్టు స్కోరు 200 మార్క్‌ను దాటింది. జడేజా 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌కు స్లో పిచ్‌ను ఉపయోగించడంతో భారత ఆటగాళ్ళు పరుగులు రాబట్టేందుకు నానాతంటాలు పడ్డారు. ప్రస్తుతం కివీస్ 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

తర్వాతి కథనం
Show comments