ఈడెన్ గార్డెన్ టెస్ట్ మ్యాచ్ : ఒక్క రోజే నేలకూలిన 16 వికెట్లు

ఠాగూర్
శనివారం, 15 నవంబరు 2025 (17:18 IST)
భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లోభాగంగా రెండో రోజైన శనివారం ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం మూడు రోజుల్లో వెల్లడికానుంది. బౌలర్ల హవా కొనసాగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం ఒక్కరోజే 16 వికెట్లు నేలకూలాయి. బ్యాటింగ్‌లో నిరాశపర్చిన భారత ఆటగాళ్లు.. బంతితో మాత్రం అదరగొడుతున్నారు. భారత స్పిన్నర్ల ధాటికి సఫారీ జట్టు బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. 
 
టీ బ్రేక్ సమయానికి 18/1తో నిలిచిన దక్షిణాఫ్రికా చివరి సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోయింది. వియాన్ ముల్డర్ (11), టోనీ డి జోర్జి (2)ని జడేజా ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. మార్‌క్రమ్ (4), ట్రిస్టన్ స్టబ్స్ (5) జడ్డూ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. కైల్ వెరినె (9)ని అక్షర్ పటేల్, మార్కో యాన్సెన్ (13)ని కుల్‌దీప్ వెనక్కి పంపాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 93/7 స్కోరుతో నిలిచి 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోర్బిన్ బాష్ (1*), తెంబా బావుమా (29*) క్రీజులో ఉన్నారు.
 
అంతకుందు భారత్ తన ఓవర్ నైట్ స్కోరు 37/1తో రెండో రోజు ఆటను కొనసాగించి చివరకు 189 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్  మాత్రమే అత్యధికంగా 39 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్‌ పంత్ (27), రవీంద్ర జడేజా (27) పరుగులు చేశారు. బ్యాటింగ్ చేస్తుండగా మెడ పట్టేయడంతో మైదానాన్ని వీడిన శుభ్‌మన్ గిల్ (4) మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. 
 
ఒక దశలో 75/1తో మెరుగైన స్థితిలో కనిపించిన భారత్ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భోజన విరామ సమయానికి 138/4తో ఉన్న టీమ్ఇండియా.. 51 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు చేజార్చుకుంది. ఈ క్రమంలోనే భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం లభించింది. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మర్ (4/30), మార్కో యాన్సెన్ (3/35) సత్తాచాటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

తర్వాతి కథనం
Show comments