కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా ఇన్నింగ్స్.. 62.2 ఓవర్లలో 189 పరుగుల వద్ద ముగిసింది. దీంతో 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 119 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 39 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
వాషింగ్టన్ సుందర్ 89 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 29 పరుగులు, రిషభ్ పంత్ 24 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు 27 రన్స్, రవీంద్ర జడేజా 45 బంతుల్లో, 3 ఫోర్లతో 27 రన్స్ చొప్పున చేశారు. అయితే, వీరంతా తమకు లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. యశస్వి జైస్వాల్ (12), ధ్రువ్ జురేల్ (14) విఫలమయ్యారు. వరుసగా వికెట్లు పడటంతో టీమ్‌ఇండియా భారీ ఆధిక్యాన్ని సాధించే అవకాశం కోల్పోయింది.
భారత ఇన్నింగ్స్‌కు కీలకమైన సమయంలో శుభ్‌మన్ గిల్ (4 నాటౌట్) గాయపడ్డాడు. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో అతడు స్వీప్ షాట్ ఆడాడు. ఈ ప్రయత్నంలో మెడ కండరాలు పట్టేయడంతో గిల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కేవలం మూడు బంతులు ఎదుర్కొన్న అతడు రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిణామం కూడా భారత జట్టు ఆధిక్యం మీద ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 4, మార్కో జాన్సెన్ 3, కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ తలో వికెట్ తీసుకున్నారు.
మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 159 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ఓపెనర్ ఐదెన్ మార్‌క్రమ్ (31) టాప్ స్కోరర్. ర్యాన్ రికెల్టన్ (23), వియాన్ ముల్డర్ (24), టోనీ డి జోర్జీ (24) ఫర్వాలేదనిపించారు. టెంబా బవుమా (3) బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. భారత బౌలర్లలో బుమ్రా (5/27) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మహ్మద్ సిరాజ్ 2, కుల్‌దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.