Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : కివీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు - భారత్ బ్యాటింగ్

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (19:14 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న అంతిమ పోరులో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు కళ్లెం వేశారు. ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లలో ఎవరు కూడా చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కీలకమైన రెండు వికెట్లు తీయగా, వరుణ్ 2, షమీ, జడేజాలో ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
కివీస్ ఇన్నింగ్స్‌లో దారిల్ మిచెల్ 63, బ్రేస్వెల్ 53 (నాటౌట్), రచిన్ రవీంద్ర 37, ఫిలిప్స్ 34, విల్ యంగ్ 15, కేన్ విలియమ్సన్ 11, లాథమ్ 14, కెప్టెన్ మైకేల్ శాంటర్న్ 8 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. నిజానికి తొలి నాలుగు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ భారీగా పరుగులు చేయలేక పోయింది. 
 
ఆ తర్వాత 252 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి 9 ఓవర్లలో 90 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 47, శుభమన్ గిల్ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇందులో రోహిత్ శర్మ మూడు ఫోర్లు, ఐదు ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

తర్వాతి కథనం
Show comments