Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్ టీ20 : భారత్ టార్గెట్ 187 రన్.. తొలి ఎదురుదెబ్బ

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (21:20 IST)
హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. 187 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత్‌ను డానియల్ శామ్స్ తొలి ఓవర్లోనే దెబ్బతీశాడు. శామ్స్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన ఓపెనర్ కేఎల్ రాహుల్.. కీపర్ వేడ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు తొలి ఓవర్లోనే కీలకమైన వికెట్ కోల్పోయి 5/1 స్కోరుతో నిలిచింది. అంతకుముందు టిమ్ డేవిడ్ (54), కామెరూన్ గ్రీన్ (52) ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 186/7 స్కోరు సాధించిన సంగతి తెలిసిందే.
 
కాగా ఈ సిరీస్‌లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ మైదానంలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. 
 
భారత్ : 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్.
 
ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్),  టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, డేనియల్ సామ్స్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజెల్ వుడ్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments