Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలో ప్రతి చిన్నారికీ స్మార్ట్‌ విద్యను అందుబాటులోకి తీసుకువస్తోన్న లూసీమ్యాక్స్‌

children
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (18:03 IST)
చిన్నారుల విద్య కోసం పెరుగుతున్న డిమాండ్‌తో పాటుగా స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని లూసీ మ్యాక్స్‌  ఇప్పుడు నాలుగంచెల అభ్యాస ఫంక్షన్‌ను భారతీయ మార్కెట్‌ కోసం విడుదల చేసింది. ఇటీవలనే ఫ్యూచర్‌ ఇంటిలిజెన్స్‌ బుక్స్‌, కొరియా ట్రేడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ- కొట్రా ముంబైతో లూసీ మ్యాక్స్‌ భాగస్వామ్యం చేసుకుని నాలుగంచెల ఫోనిక్స్‌ను హైదరాబాద్‌లోని శ్రీ వివేకానంద విద్యా వికాస్‌ కేంద్ర అనాధశరణాలయం, హైదరాబాద్‌లోని సాహెబ్‌ నగర్‌ జెపీహెచ్‌ఎస్‌లోని పేద, నైపుణ్య రహిత చిన్నారులకు అందజేసింది.
 
భారతదేశంలో చిన్నారుల విద్య అత్యంత పోటీ కలిగి ఉంది. స్మార్ట్‌ విద్య ఇప్పుడు తక్షణావసరం. లూసీ మ్యాక్స్‌ అనేది కొరియా బ్రాండ్‌. చిన్నారుల కోసం పుస్తకాలను పరిచయం చేయడానికి ఇది ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఎన్నో సంవత్సరాలుగా కార్యకలాపాలను నిర్వహిస్తుండటంతో పాటుగా  చిన్నారుల పరిశోధనాధారిత విద్యపై దృష్టి కేంద్రీకరిస్తుంది. నాలుగంచెల ఫోనిక్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా  చిన్నారులో ప్రాధమిక విద్యను మెరుగుపరిచేందుకు లూసీ మ్యాక్స్‌ కృషి చేస్తోంది.
 
ఈ కొరియన్‌ విద్యా బ్రాండ్‌, చిన్నారులకు సృజనాత్మక మార్గంలో పుస్తకాలను పరిచయం చేయడానికి  కృషి  చేస్తుంది. పలు దేశాలలో విస్తృత స్ధాయిలో వీరు తమ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా సంవత్సరాల తరబడి పరిశోధనతో చిన్నారుల కోసం ఎడ్యుకేషన్‌ ఫంక్షన్‌ అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. భారతదేశపు మార్కెట్‌లో వీరు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఫ్యూచర్‌ ఇంటిలిజెన్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ మద్దతు అందిస్తుంది.
 
పుస్తక పంపిణీ కార్యక్రమంలో శాంగ్‌ క్యు కిమ్‌, సీఈఓ, లూసీ మ్యాక్స్‌ మాట్లాడుతూ, ‘‘డబ్బు పరంగా నిరుపేదలే అయినప్పటికీ తెలివితేటల పరంగా సంపన్నులైన ఈ చిన్నారులతో ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది. చిన్నారుల విద్య కోసం అతి పెద్ద మార్కెట్‌‌గా ఇండియా నిలుస్తుంది. ఈ దేశం మాకు అందించే అపార అవకాశాలను అన్వేషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. భారతదేశంలో ప్రతి చిన్నారికీ అత్యంత నాణ్యమైన విద్య అందించాలన్నది మా లక్ష్యం. అది వారి ప్రాధమిక హక్కు!’’ అని అన్నారు.
 
ఫ్యూచర్‌ ఇంటిలిజెన్స్‌ బుక్స్‌ నుంచి విక్రమ్‌ మాట్లాడుతూ, ‘‘ ప్రతి ఒక్క చిన్నారి అత్యుత్తమ విద్యను పొందేందుకు అర్హులు. భారతీయ మార్కెట్‌ కోసం కిమ్‌ వెల్లడించిన లక్ష్యంతో ఫ్యూచర్‌ ఇంటిలిజెన్స్‌ బుక్స్‌ స్ఫూర్తి పొందింది. భారతదేశంలో చిన్నారుల విద్య విభాగంలో భారీ ప్రభావం వారు చూపాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి : ఏపీలో మూడు రోజులు వర్షాలు