Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : మ్యాచ్ వర్షార్పణం... ఫైనల్‌కు భారత్

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (12:42 IST)
సిడ్నీ వేదికగా ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గురువారం ఆతిథ్య ఇంగ్లండ్, పర్యాటక భారత్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడిపోకుండా వచ్చిన భారత మహిళల క్రికెట్ నేరుగా ఫైనల్‌కు అడుగుపెట్టింది. గత టోర్నీలో భారత జట్టు ఇదే ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారిపట్టిన విషయం తెల్సిందే. ఇపుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 
 
ఇదిలావుంటే టీమిండియా ఈ మెగా టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచి మెరుగైన రన్‌రేట్ సాధించడం వల్ల ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా రద్దయితే.. ఆదివారం భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 

గ్రూపు ఏ లో ఉన్న భారత క్రికెట్ జట్టు తాను ఆడిన నాలుగు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, పటిష్టమైన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసింది. చివరగా ఇంగ్లండ్‌తో గురువారం మ్యాచ్ జరగాల్సివుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments