Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : భారత్ బ్యాటింగ్ .. వైస్ కెప్టెన్ ఔట్

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (15:44 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా గురువారం మాంచెష్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మొదటి వికెట్‌కు 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 18 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న రోహిత్... ఓ సిక్సర్, ఒక ఫోర్ సాయంతో 18 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. 
 
అంతకుముందు ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో గాయపడిన భువనేశ్వర్ ఫిట్నెస్ సాధించినప్పటికీ.. మేనేజ్‌మెంట్ మాత్రం మహ్మద్ షమీనే నమ్ముకుంది. అందుకే తుదిజట్టులో షమీకే స్థానం కల్పించారు. 
 
భువీకి కూడా స్థానం కల్పిస్తారని, భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలో దిగుతుందని మ్యాచ్ ముందు ప్రచారం జరిగినా, స్పిన్ ఆడడంలో విండీస్ తడబడుతుందన్న నేపథ్యంలో కోహ్లీ ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లకే ఓటేశాడు. దాంతో, చహల్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలు నిలుపుకున్నారు. అలాగే, వెస్టిండీస్ జట్టు రెండు మార్పులు చేసింది. 
 
జట్టు వివరాలు 
భారత్ : రాహుల్, రోహిత్, కోహ్లీ, శంకర్, జాదవ్, ధోనీ, పాండ్యా, షమీ, కుల్దీప్, చాహల్, బుమ్ర. 
 
వెస్టిండీస్ : గేల్, అంబ్రీస్, హోప్, పూరన్, హెట్మియర్, హోల్డర్, బ్రాత్‌వైట్, అలెన్, రోచ్, కోట్రెల్, థామస్. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments