Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపానులో చిక్కుకునిపోయిన టీమిండియా.... రంగంలోకి దిగిన బీసీసీఐ

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (12:14 IST)
భారత క్రికెట్ జట్టు తుఫానులో చిక్కుకునిపోయింది. వెస్టిండీస్‌లో తీవ్ర తుఫాను కారణంగా బ్రిడ్జె‌టౌన్ విమానాశ్రయంలో విమాన సేవలను పూర్తిగా రద్దు చేశారు. ఈ కారణంగా అక్కడ నుంచి స్వదేశానికి చేరుకోవాల్సిన భారత పురుషుల క్రికెట్ జట్టు సభ్యులు చిక్కుకునిపోయారు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగంలోకి దిగింది. అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన హరికేన్ బెరిల్ తీవ్ర ప్రభావం బార్బడోస్‌పై కూడా పడింది. అక్కడ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో బ్రిడ్జిటౌన్‌లోని ఎయిర్ పోర్టులో ఆదివారం సాయంత్రం విమాన సర్వీసులు అన్నింటినీ రద్దు చేశారు. నిజానికి బార్బడోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి ఎమిరేట్స్ విమానంలో ముంబైకు చేరుకోవాల్సివుంది. కానీ హారికేన్ బెరిల్ ప్రభావంతో ప్రయాణం వాయిదా పడిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
 
కాగా ప్రయాణం వాయిదా పడిన నేపథ్యంలో తదుపరి ఏర్పాట్లను బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలుపుకొని మొత్తం 70 మంది బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. అమెరికా నుంచి భారీ చార్టెర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి నేరుగా బ్రిడ్జ్ టౌన్ నుంచి న్యూఢిల్లీ తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
జులై 2న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటగాళ్లు చేరుకునే అవకాశం ఉంది. వీరికి ఘనస్వాగతం లభించే అవకాశాలు ఉన్నాయి. కాగా, వరల్డ్ కప్ గెలిచిన ఆటగాళ్ల బృందం నేరుగా ఢిల్లీకి వెళ్తే వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా చిరస్మరణీయ టీ20 ప్రపంచ కప్ 2024 గెలుపు అనంతరం భారత ఆటగాళ్ల రాక కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

కేటీఆర్ చేసిన కుట్రలకు ఆయన జైలుకు వెళ్లనున్నారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

తర్వాతి కథనం
Show comments