Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజ్వల్.. ప్లీజ్ ఎక్కడున్నా పోలీసులకు లొంగిపో : మనవడికి తాత దేవెగౌడ వినతి

devegowda

ఠాగూర్

, శుక్రవారం, 24 మే 2024 (10:50 IST)
మహిళలపై దౌర్జన్యంగా లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక హాసన్ సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ హాసన్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణకు ఆయన తాత, మాజీ ప్రధాని దేవెగౌడ ఓ విన్నపం చేశారు. ప్రజ్వల్.. ఎక్కడున్నా పోలీసులకు లొంగిపో.. ప్లీజ్  అంటూ కోరారు. తన సహనాన్ని పరీక్షించవద్దని లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పైగా, ఇది విజ్ఞప్తి కాదు.. వార్నింగ్ అంటూ మందలించారు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతావన్నారు. కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని పేర్కొంటూ దేవెగౌడ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 
కాగా, మే 18వ తేదీన ఓ ఆలయానికి వెళుతూ ప్రజ్వల్ గురించి మాట్లాడానని... అతను తనకు, తన కుటుంబానికి, పార్టీకి, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ చెప్పలేనిదన్నారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందన్నారు. కేసులో దోషిగా తేలితే శిక్ష పడాల్సిందే అన్నారు. కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నారని తెలిపారు.
 
కొన్ని రోజులుగా తనపైనా, తన కుటుంబంపైనా ప్రజలు కఠినమైన పదాలు వాడుతున్న విషయం తెలుసునని పేర్కొన్నారు. అయితే వాస్తవాలు బయటకు వచ్చేవరకు వాటిని ఆపాలని చెప్పడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. తన అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు తన వెంట ఉన్నారని.. ఇందుకు వారికి రుణపడి ఉన్నానన్నారు. వారి విశ్వాసాన్ని తిరిగి పొందడమే తనకు ముఖ్యమైన అంశమన్నారు. 
 
కాగా, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం దేశం విడిచి పారిపోయ, జర్మనీలో ఉన్నట్టు సమాచారం. ఇదే కేసులో ఆయన తండ్రి మాజీ మంత్రి రేవణ్ణను పోలీసులు అరెస్టు చేయగా ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. కాగా, ప్రజ్వల్ లైంగిక దౌర్జన్య కేసు కర్నాటక రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇద్దరు టెక్కీ మృతికి కారణమైన వ్యక్తికి గంటల వ్యవధిలో బెయిలా? వెనక్కి తగ్గిన జువైనల్ బోర్డు!!