Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ప్రత్యేక కోర్టు

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఓ వైపు భార్యామణి ఆరోపణలతో తలపట్టుకుని కూర్చున్న వేళ, డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడంటూ టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లోకెక్కాడు. దేశంలోకి

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (11:05 IST)
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఓ వైపు భార్యామణి ఆరోపణలతో తలపట్టుకుని కూర్చున్న వేళ, డాక్టర్ అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడంటూ టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లోకెక్కాడు. దేశంలోకి రిజర్వేషన్లనే రోగాన్ని ఎక్కించారంటూ పాండ్యా చేసిన ట్వీట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. ఈ ట్వీట్స్ గత ఏడాది డిసెంబరులో చేసినా.. పాండ్యాపై కేసు నమోదు చేయాలని ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది. 
 
పాండ్యా ట్వీట్స్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించేలా వుందంటూ డీఆర్ మేఘ్‌వాల్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాండ్యా తన ట్వీట్‌తో అంబేద్కర్‌ను, ఆ సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీశాడని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
కాగా రిజర్వేషన్లు అనే వ్యాధిని దేశంలో అంబేద్కర్ వ్యాప్తి చేశారని పాండ్యా ట్వీట్ చేశాడు. పాండ్యా లాంటి పాప్యులర్ క్రికెటర్ ఇటువంటి ట్వీట్లు చేయడం సమంజసం కాదన్న పిటిషన్‌దారు పేర్కొన్నారు. ఆ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా రాజ్యాంగాన్ని తూలనాడాడని పేర్కొన్నారు. 
 
రాజ్యాంగ నిర్మాణాన్ని పాండ్యా అపహాస్యం చేశాడని ఆరోపించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో పాండ్యాకు కొత్త చిక్కొచ్చి పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments