మాజీ క్రికెటర్‌ను విమానం నుండి తోసేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (15:54 IST)
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లాటర్‌ను విమానం నుండి దిగిపోవాలంటూ విమాన సిబ్బంది దించేశారు. స్లాటర్ మంగళవారం సిడ్నీ నుండి వాగ్గా విమానం ఎక్కాడు. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులతో గొడవకు దిగడమే కాకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. వీరి వాదన కారణంగా విమానం అరగంట ఆలస్యమైంది.
 
దీంతో కోపగించుకున్న తోటి ప్రయాణికులు స్లాటర్‌నను దింపేయాలంటూ కోరారు. వెంటనే స్లాటర్ బాత్రూంలోకి దూరి తలుపు పెట్టుకున్నాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి విమానంలో నుంచి గెంటేశారు.
 
క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత స్లాటర్ ప్రస్తుతం టెలివిజన్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019కు కూడా కామెంటేటర్‌గా సిద్ధమవుతున్నాడు. విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించడంపై మైకేల్ స్లాటర్ వివరణ ఇచ్చుకున్నాడు.
 
వాగ్గా బోర్డింగ్ పాయింట్‌లో విమానం ఎక్కేందుకు వచ్చిన ఇద్దరి స్నేహితులతో వాదనకు దిగానని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టినందుకు వారికి తాను క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. మైకేల్ స్లాటర్ 1993 నుంచి 2001 వరకూ ఆస్ట్రేలియా జట్టులో ప్లేయర్‌గా కొనసాగి 74 టెస్టుల్లో ఆడాడు. 2004లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ టైమ్ పూర్తయింది.. ఇపుడు మా టైమ్ మొదలైంది : కె.కవిత

మహిళ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదు : ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణాలో జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

డిన్నర్ మీట్ కాల్పుల నిందితుడు మెకానికల్ ఇంజనీర్...

కూల్‌డ్రింక్స్ అందించే ట్రాలీ గది సమీపంలో నక్కిన నిందితుడు కోలో టోమోస్ అలెన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

మీడియాకు వార్నింగ్ ఇస్తున్న బిగ్ బాస్ ఫేం అషురెడ్డి

పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం.. బిగ్ బాస్ అషురెడ్డిపై కేసు

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

తర్వాతి కథనం
Show comments