Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కోసం సాహసం చేసిన అభిమాని.. అయినా పరుగు ఆపని మహీ?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (18:49 IST)
Dhoni
ఐపీఎల్ పండగ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై చేరుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చెన్నైకి చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ కోసం ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు. మైదానంలో పరుగు తీస్తున్న ధోనీతో షేక్ హ్యాండ్‌ కోసం సాహసోపేతంగా స్టేడియంలోని బారికేడ్లని దాటి మైదానంలోకి పరుగెత్తాడు. 
 
అభిమాని తనవైపు రావడాన్ని గమనించిన మహీ పరుగు ఆపలేదు. కానీ.. కొద్దిగా వేగం తగ్గించి.. ఆ అభిమానికి షేక్‌హ్యాండ్ ఇచ్చి తన పని తాను చేసుకుపోయాడు. అప్పటికే స్టేడియం భద్రతా సిబ్బంది అభిమానిని సమీపించి.. అతడ్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. దీంతో చెపాక్ స్టేడియంలోని భద్రతా సిబ్బందికి అభిమానుల్ని కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 
 
ఇకపోతే.. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌‌ జట్టు ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల నుంచి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments