రాజ్‌కోట్ టీ20కి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఇదే...

ఠాగూర్
మంగళవారం, 28 జనవరి 2025 (13:03 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య స్వదేశంలో ట్వంటీ20 టోర్నీ జరుగుతుంది. మొత్తం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ ఘన విజయం సాధించింది. మూడో మ్యాచ్ మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం పర్యాటక ఇంగ్లండ్ జట్టు తమ జట్టును ప్రకటించింది. 
 
రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచుకు కూడా కొనసాగించనున్నట్టు తెలిపింది. మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 
 
కాగా, రెండో టీ20లో ఇంగ్లీష్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్ ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో అరంగేట్రం చేశారు. కార్స్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 
 
17 బంతుల్లో 31 రన్స్ బాదిన అతడు.. బౌలింగ్‌లో మూడు వికెట్లు కూడా తీశాడు. అటు స్మిత్ కూడా 12 బంతుల్లో 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వీరిద్దరూ గాస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో జట్టులోకి వచ్చారు.
 
'మేము సిరీస్‌లో వెనకబడిపోయాం. కనుక తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నాం. అందుకే రెండో టీ20లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న జట్టునే మూడో టీ20కి కూడా కొనసాగించాలని నిర్ణయించాం' అని ఇంగ్లండ్ క్రికెట్ మూడో టీ20 కోసం 'ప్లేయింగ్ ఎలెవన్'ను ప్రకటించిన తమ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

తర్వాతి కథనం
Show comments