దేశ వాణిజ్యరాజధాని ముంబై మహానగరంలో ఓ క్యాబ్ డ్రైవర్‌పై ఓ యువతి అమానుషంగా దాడి చేసింది. క్యాబ్ విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఆ యువతి ప్రయాణించాల్సిన ఫ్లైట్ మిస్సైంది. దీంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విమానాశ్రయం బయటే క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని చితక్కొట్టింది. డ్రైవర్ వల్లే తన ఫ్లైట్ మిస్ అయ్యిందని ఆరోపిస్తూ ఉరికించి కొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ముంబై నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది.
ఈ రహదారులపై వాహనాన్ని వేగంగా నడపడం ఎంతో కష్టం. అందుకే క్యాబ్ డ్రైవర్ నిర్ణీత సమయంలోగా ఎయిర పోర్టుకు చేరుకోలేకపోయారు. ఈ కారణంగా ఆ యువతి ప్రయాణించాల్సిన విమానం మిస్సైంది. దీంతో ఆ యువతికి పట్టరాని కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై దాడికి దిగింది. దీనిపై బాధితుడు సమీప పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.