ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు.. మెరవని రోహిత్ శర్మ.. భయపెట్టిన డీసీ

సెల్వి
శనివారం, 27 ఏప్రియల్ 2024 (22:41 IST)
DC v MI
అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు.
 
ఢిల్లీ ఆటగాళ్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (84 పరుగులు; 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్ (48 పరుగులు; 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41 పరుగులు; 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు. ముంబై బౌలర్లలో బుమ్రా (1/35) మినహా మిగిలినందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.
 
అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4x4, 4x,6) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా (46), టిమ్ డేవిడ్ 37 పరుగులు సాధించారు. 
 
ఈ క్రమంలోనే ముంబై పవర్‌ప్లేలో 65 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్య తిలక్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని హార్దిక్ భారీ షాట్లు ఆడాడు. 
 
ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించకపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే ఆరంభం దక్కింది. ఈ క్రమంలో ఫ్రేజర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డును రెండో సారి సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాడిపత్రిలో వైకాపా నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై దాడి - ఉద్రిక్తత

వరకట్నం వేధింపులు.. భర్త ఇంట్లో లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య

టిక్ టాక్ వీడియోలు పోస్ట్ చేసిన యువతిని కాల్చి చంపేశారు... ఎక్కడ?

High alert: ఎర్రకోట సమీపంలో పేలుడు.. పది మంది మృతి.. హైదరాబాదులో అలెర్ట్

APCRDA: నవంబర్ 14-15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments