Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీకే నాయుడు ట్రోఫీ.. స్వప్నిల్ అదుర్స్.. ట్రిపుల్ సెంచరీతో హైదరాబాదుకు చెక్

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (11:50 IST)
అండర్-23 క్రికెట్ టోర్నీలో స్వప్నిల్ ఫుల్ పగర్ మెరిశాడు. కల్నల్ సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో మహారాష్ట్ర అదరగొట్టింది. స్వప్నిల్ అయితే విజృంభించాడు. ఏకంగా 472 బంతుల్లో 328 పరుగులు చేశాడు. ఇందులో 41 ఫోర్లు, రెండు సిక్సర్లు వున్నాయి. ఫలితంగా ట్రిపుల్ సెంచరీ స్వప్నిల్ ఖాతాలో పడింది. స్వప్నిల్ అదుర్స్ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ 'డ్రా' అయ్యింది. ఈనెల 13 నుంచి సూరత్‌ వేదికగా జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది.
 
ఈ నేపథ్యంలో ఓవర్‌నైట్‌ స్కోరు 294/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన మహారాష్ట్ర జట్టు ఆట ముగిసే సమయానికి 172 ఓవర్లలో 7 వికెట్లకు 656 పరుగులతో నిలిచింది. దీంతో ఆతిథ్య జట్టుకు 3 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. స్వప్నిల్‌ ట్రిపుల్‌ సెంచరీతో కదం తొక్కగా.. యశ్‌ క్షీర్‌సాగర్‌ (288 బంతుల్లో 142; 18 ఫోర్లు) సెంచరీతో అలరించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 326 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 
 
బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించి 653 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ హైదరాబాద్‌ బౌలర్లు ప్రభావం చూపించలేకపోవడంతో ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కోల్పోయి కేవలం ఒకే పాయింట్‌కు పరిమితమైంది. మహారాష్ట్రకు 3 పాయింట్లు దక్కాయి. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments