Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో భారీ సెక్స్ రాకెట్.. ముంబై నుంచి యువతులను?

Advertiesment
హైదరాబాదులో భారీ సెక్స్ రాకెట్.. ముంబై నుంచి యువతులను?
, సోమవారం, 30 డిశెంబరు 2019 (10:50 IST)
హైదరాబాదులో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. నిర్వాహకుడితో పాటు ఆరుగురు యువతులు, నలుగురు విటులను పోలీసులను అరెస్టు చేశారు. ముంబై నుంచి యువతులను రప్పించి, వారితో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌‌కు చెందిన దీపక్‌ అనే వ్యక్తి.. కాటేదాన్‌లో నివాసం ఉంటున్నాడు. ఉప్పర్‌పల్లి ప్రాంతంలోని సన్‌రైజ్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ముంబై నుంచి అందమైన యువతులను రప్పించి వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. 
 
ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు యువతులు, నలుగురు విటులు, దీపక్ సహా మరో వ్యక్తి పట్టుబడ్డాడు. వీరివద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్‌తో పాన్‌ కార్డును లింక్‌ చేయకపోతే రద్దు ఖాయం!