Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్.. ఆఫ్రిది రికార్డు సమం

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మరో రికార్డును నెలకొల్పాడు. టెస్ట్, వన్డే, పొట్టి క్రికెట్ ఫార్మెట్లలో కలిపి అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా పేరుగడించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక

Webdunia
సోమవారం, 30 జులై 2018 (14:28 IST)
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మరో రికార్డును నెలకొల్పాడు. టెస్ట్, వన్డే, పొట్టి క్రికెట్ ఫార్మెట్లలో కలిపి అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా పేరుగడించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్థాన్ చిచ్చరపిడుగు షాహిద్ ఆఫ్రిది పేరుపై ఉండేది. ఇపుడు ఆఫ్రిది సరసన క్రిస్ గేల్ కూడా చేరాడు.
 
సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో గేల్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గేల్ 66 బంతుల్లో 73 రన్స్ చేశాడు. అందులో 5 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్ గేల్, అఫ్రిదిలు ఇప్పటివరకు మొత్తం 476 సిక్స్‌లను కొట్టారు. 
 
విండీస్ పవర్ బ్యాట్స్‌మెన్ గేల్ కేవలం 443 మ్యాచ్‌ల్లో ఆ ఘనతను అందుకున్నాడు. ఆఫ్రిది మాత్రం 524 మ్యాచ్‌ల్లో ఆ రికార్డును నెలకొల్పాడు. భారీ భారీ షాట్లతో అలరించే క్రిస్ గేల్... త్వరలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఎందుకంటే, ఆగస్టు ఒకటో తేదీన బంగ్లాతో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కొట్టిన కొత్త రికార్డు తన పేరిట నమోదు కానుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్రిది కన్నా 81 మ్యాచ్‌లు గేల్ తక్కువే ఆడటం గమనార్హం. 
 
ఆఫ్రిది వన్డేల్లో 351, టీ20ల్లో 73, టెస్టుల్లో 52 సిక్సర్లు కొట్టాడు. మరో వైపు గేల్ వన్డేల్లో 275, టీ20ల్లో 103, టెస్టుల్లో 98 సిక్సర్లు బాదాడు. మిస్టర్ కూల్ ధోనీ ఈ లిస్టులో ఐదో స్థానంలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments