Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యద్భుతం.. ఒకే రింగ్‌లో అన్ని ఉంగరాలా?

సాధారణంగా వజ్రపు ఉంగరంలో ఒకటి లేదా రెండు, అలాకాకుంటే గరిష్టంగా తొమ్మిది వజ్రాలను అమర్చుతారు. కానీ, ఇక్కడు ఒకే రింగులో ఏకంగా 6,690 వజ్రాలను (డైమండ్స్)ను అమర్చారు. వీటన్నింటినీ 18 క్యారెట్ల ఉంగరంలో అమర్

అత్యద్భుతం.. ఒకే రింగ్‌లో అన్ని ఉంగరాలా?
, శనివారం, 30 జూన్ 2018 (08:49 IST)
సాధారణంగా వజ్రపు ఉంగరంలో ఒకటి లేదా రెండు, అలాకాకుంటే గరిష్టంగా తొమ్మిది వజ్రాలను అమర్చుతారు. కానీ, ఇక్కడు ఒకే రింగులో ఏకంగా 6,690 వజ్రాలను (డైమండ్స్)ను అమర్చారు. వీటన్నింటినీ 18 క్యారెట్ల ఉంగరంలో అమర్చారు.
 
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్‌ బుక్‌ రికార్డులోకి ఎక్కింది. విశాల్‌ అగర్వాల్‌, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు.
 
ఈ ఉంగరం విలువ రూ.28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్‌ చేశారు. ఈ లోటస్‌ డైమండ్‌ రింగ్‌ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని వారు వెల్లడించారు. 
 
నీటి రక్షణ, పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ఉంగరాన్ని తామర పువ్వు ఆకృతిలో తయారు చేసినట్టు చెప్పారు. ఈ లోటస్‌ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి.. కాపాడావా.. తిరుమలలో శేఖర్ రెడ్డి...