గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన రెండు పిల్లులు... పాపం మంటల్లో పడీ....
రికార్డులు మనుషులకే సొంతం కాదు. జంతువులు కూడా సృష్టిస్తుంటాయన్నది తెలిసిందే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రెండు పిల్లులు మంటల్లో చిక్కుకున్నాయి. అమెరికాలోని డిట్రాయిట్లోని ఓ యజమాని ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ రెండు పిల్లులు చిక్కుకున్నాయి.
రికార్డులు మనుషులకే సొంతం కాదు. జంతువులు కూడా సృష్టిస్తుంటాయన్నది తెలిసిందే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రెండు పిల్లులు మంటల్లో చిక్కుకున్నాయి. అమెరికాలోని డిట్రాయిట్లోని ఓ యజమాని ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ రెండు పిల్లులు చిక్కుకున్నాయి. వాటిని రక్షించేందుకు యజమాని మంటల్లో దూకబోగా స్థానికులు అతడిని వారించారు. రికార్డు నెలకొల్పిన పిల్లులు అలా మంటల్లో ఆహుతవుతుంటే యజమాని బోరుమని విలపించారు.
కాగా ఈ పిల్లులు సృష్టించిన రికార్డును చూస్తే... ఇంట్లో పెరిగే పిల్లుల్లోనే అత్యంత పొడవైన పిల్లిగా ఒకటి రికార్డు సృష్టించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దీని పొడవు 48 సెంటీమీటర్లు. సాధారణంగా పిల్లి పొడవు 25 సెం.మీ నుంచి 35 సెం.మీ దాకా వుంటుంది. మరొక పిల్లి ఏ పిల్లికీ లేనంత తోక పొడవు 43 సెంటీమీటర్లతో రికార్డు సృష్టించింది. ఈ రెండు పిల్లులు అగ్నికి ఆహుతయ్యాయి.