అయ్యప్పస్వామిని చూసేందుకు వెళుతూ... ఎస్సైతో ముగ్గురు దుర్మరణం

తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడి పట్టణానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పామిడిలోని బొడ్డురాయి వీధికి చెందిన రఘు , రాంప్రసాద్‌ అయ్యప్పస్వామి దర్శనానికి శనివారం ఉదయం పామిడి నుంచి తన మిత్రు

మంగళవారం, 19 డిశెంబరు 2017 (17:43 IST)
తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడి పట్టణానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా... మరొకరి పరిస్థితి  విషమంగా ఉంది. పామిడిలోని బొడ్డురాయి వీధికి చెందిన రఘు , రాంప్రసాద్‌  అయ్యప్పస్వామి దర్శనానికి శనివారం ఉదయం పామిడి నుంచి తన మిత్రులైన మధుసూదన్‌రెడ్డి సుబ్బరాయుడుతో కలిసి సొంత కారు టీఎస్‌ 08 క్యూ 0006లో డ్రైవర్‌ మహేష్‌తో కలిసి వెళ్లారు. 
 
వీరు ప్రయాణిస్తున్న కారు మధురై సమీపంలోని మరవన్‌కుళం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఎస్సై రఘుతో పాటు ఆయన సోదరుడు, కానిస్టేబుల్‌ రాంప్రసాద్‌ అలియాస్‌ చిన్నా, మిత్రుడు మధుసూదన్‌ రెడ్డి, డ్రైవర్‌ మహేష్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని స్థానికులు.. పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో పామిడిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం లేబర్ వార్డులో ప్రసవం కాబోతుండగా.. పరీక్ష రాసింది..