Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : బంగ్లా - కివీస్ మ్యాచ్ సెమీస్ బెర్తులను ఖరారు చేస్తుందా?

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (09:41 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం రాత్రి ఆతిథ్య పాకిస్థాన్, భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో కివీస్ జట్టు పాకిస్థాన్ జట్టును చిత్తు చేసింది. అలాగే, భారత్ బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లను ఓడించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వుంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలతో భారత్, కివీస్ జట్లు దూసుకెళుతున్నాయి. అయితే, సోమవారం బంగ్లాతో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టే జట్లను ఖరారు చేయనుంది. 
 
ప్రస్తుతం సెమీ ఫైనల్‌పై కన్నేసిన కివీస్ జట్టు సోమవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దీంతో కివీస్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పైగా, మంచి రన్‌రేట్‌ను కూడా కలిగివుంది. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పరంగా రెండో స్థానంలో ఉంది. 
 
మరోవైపు, బంగ్లాదేశ్ జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. గ్రూపులో మూడో స్థానంలో వుంది. పైగా, అన్ని విభాగాల్లో బలంగా ఉన్న కివీస్ జట్టును బంగ్లా కుర్రోళ్లు అడ్డుకోవడం అంత ఈజీకాదు. అయితే, గత చాంపియన్స్ ట్రోఫీలో కివీస్ జట్టును బంగ్లాదేశ్ ఓడించి సంచలనం సృష్టంచింది. 
 
ఈ మ్యాచ్‌తో గ్రూపు-ఏలో సెమీస్ బెర్తులు తేలిపోయే అవకాశం ఉంది. కివీస్ గెలిస్తే ఆ జట్టుతో పాటు టీమిండియా జట్లు సెమీస్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అపుడు ఆతిథ్య పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సివుంది. కివీస్ ఓడితే పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు రేసులో ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

తర్వాతి కథనం
Show comments