Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరంటే...

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (22:37 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును భారత్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆ తర్వాత 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 44 పరుగులతో విజయభేరీ మోగించింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 4వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. 
 
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీ చేయగా, అక్షర్ పటేల్, హార్ధిక్ ప్యాండ్యాలు మ్యాచ్ ఆఖరులో ఆదుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు మంచి శుభారంభం దక్కలేదు. కివీస్ పేసర్ల ధాటికి కేవలం 30 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ (15), గిల్ (2), కోహ్లి (11) చొప్పున పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. అయితే, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల జోడీ కుదురుగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయ్యర్ 98 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 61 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశారు. 
 
హార్దిక్ పాండ్యా (45), కేఎల్ రాహుల్ (23) కూడా మ్యాచ్ ఆఖరులో ఫర్వాలేదనిపించారు. దీంతో జట్టు స్కోరు 200 మార్క్‌ను దాటింది. జడేజా 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్‌కు స్లో పిచ్‌ను ఉపయోగించడంతో భారత ఆటగాళ్ళు పరుగులు రాబట్టేందుకు నానాతంటాలు పడ్డారు. కివీస్ 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. 
 
అయితే, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్‌తో ఆలరించాడు. వరుణ్ ఏకంగా ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ 2, పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. కివీస్ ఇన్నింగ్స్‌లలో కేన్ విలియమ్సన్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్‌గా విల్ యంగ్ 22, కెప్టెన్ మిచెల్ శాంటర్న్ 22 పరుగులు చేశారు. 
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌తో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. గ్రూపు-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు, గ్రూపు- బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇందులో ఈ నెల 4వ తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనుండగా, మార్చి 5న లాహోర్ వేదికగా రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. మార్చి 9వ తేదీన ఫైనల్ మ్యాచ్ భారత్ గెలిస్తే దుబాయ్‌లోనూ, భారత్ సెమీస్‌లో ఓడిపోతే ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్‌లో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

ప్రేమకు అడ్డుగా ఉందని యువతి తల్లిపై ప్రేమోన్మాది దాడి.. గొంతు పిసికి చంపడానికి యత్నం (Video)

ఛాతినొప్పి పేరుతో పోసాని డ్రామాలు... ఖాకీలకు వైకాపా నేత ముప్పతిప్పలు (Video)

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్

సరూర్ నగర్‌లో పది మంది హిజ్రాల అరెస్టు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

తర్వాతి కథనం
Show comments