Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?

Advertiesment
icc champions trophy

ఠాగూర్

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (18:45 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, శుక్రవారం క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌‍లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. 
 
ఆప్ఘాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ 85 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 67, ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 22 చొప్పున పరుగులు చేశాడు. మిగిలి ఆటగాళ్లలో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా, రహ్మత్ షా 12, కెప్టెన్ హష్మతుల్లా షాహిది 20, మహ్మద్ నబీ 1, రషీద్ ఖాన్ 19 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షూయిస్ 3, స్పిన్నర్ జాన్సన్ 2, ఆడమ్ జంపా 2, నేథన్ ఎల్లిస్ 1, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు. ఆ తర్వాత 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు... 1.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jasprit Bumrah: ఐపీఎల్‌కు అందుబాటులో జస్ప్రీత్ బుమ్రా!!