Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్.. రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:46 IST)
ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరిగే అవకాశం లేదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్‌లో ఫిబ్రవరి 14న తేదీన జైషే అనే ఉగ్రవాద మూకలు నిర్వహించిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ మద్దతిచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా పుల్వామా దాడితో భారత్-పాక్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఈ మ్యాచ్‌ను యధావిధిగా జరపాల్సిందేనని ఐసీసీ తేల్చేసింది. అయితే భవిష్యత్తులో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు. కానీ సచిన్ లాంటి వారు మాత్రం పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడి తీరాల్సిందేనని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇకపై వాణిజ్యం, క్రికెట్ వంటివి వుండవని తెలిపారు. దీంతో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments