జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి పాకిస్థాన్ పాలకులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోయినప్పటికీ.. ఆ దేశానికి చెందిన ఓ మహిళను కదిలించింది. ఫలితంగా ఆమె కన్నీరు పెట్టింది. భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు సెహీర్ మీర్జా. ఆమె ఓ జర్నలిస్టు.
పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. అంతేనా.. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బాహాటంగానే ప్రకటించారు. పైగా, భారత్‌కు మద్దతుగా 'యాంటీ హేట్ చాలెంజ్'ను చేపట్టింది. "దేశభక్తి కోసం మానవత్వాన్ని కుదువ పెట్టలేం" అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకుంది. దాని కింద.. "నేను పాక్ అమ్మాయిని. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను" అనే ప్లకార్డుతో కూడిన పోస్ట్ చేసింది.
ఇపుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది పాక్ పౌరులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. భారత్-పాక్ మధ్య స్పర్థలు పోయి.. శాంతినెలకొనాలని చాన్నాళ్లుగా సెహీర్ మీర్జా పోరాడుతోంది. అలాగే, భారత్ ప్రభుత్వం కూడా పాకిస్థానత్ పీచమణిచేలా చర్యలు చేపడుతోంది.