Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకేంటి ప్రాబ్లమ్.. పీసీబీకి షాకిచ్చిన ఐసీసీ (video)

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (12:12 IST)
పుల్వామా ఘటన నేపథ్యంలో.. సీఆర్పీఎఫ్ జవాన్లను గౌరవించే దిశగా భారత క్రికెటర్లు ఆర్మీ టోపీతో ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్లు ఆర్మీటోపీతో కనిపించారు. అయితే ఆర్మీ టోపీని ధరించి టీమిండియా క్రికెటర్లు క్రికెట్ ఆడటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మండిపడింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఐసీసీని కోరింది. 
 
కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ట్వంటీ-20 సిరీస్ నెగ్గింది. అలాగే ఐదు వన్డేల్లో నాలుగు వన్డేలు ఆడింది. ఇందులో మూడో వన్డేలో భాగంగా భారత క్రికెటర్లు జవాన్లను గౌరవించే దిశగా ఆర్మీ టోపీలను ధరించి మైదానంలో ఆడారు. ఈ టోపీలను ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా వున్న ధోనీ ఆటగాళ్లకు అందించాడు.
 
అంతేగాకుండా ఆ రోజు నాటి మ్యాచ్ ఫీజును టీమిండియా క్రికెటర్లు పుల్వామా సీఆర్పీఎఫ్ కుటుంబీకులకు అందజేశారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. క్రికెట్ ఆటలో రాజకీయాలెందుకని ప్రశ్నించింది. క్రికెట్ జెంటిల్మెన్ క్రీడ అని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై ఐసీసీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ వివరణ ఇచ్చింది. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంజలి ఘటించే దిశగా టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్ ధరించారని.. ఆ రోజు మ్యాచ్ ఫీజు కూడా జవాన్ల కుటుంబీకులకు అందజేశారని ఐసీసీ స్పష్టం చేసింది. అలాగే ఐసీసీ అనుమతితోనే బీసీసీఐ టీమిండియా క్రికెటర్లకు ఆర్మీ క్యాప్‌తో ఆడారని ఐసీసీ స్పష్టం చేసింది. కాబట్టి ఇందులో ఎలాంటి నియమాలను భారత్ ఉల్లంఘించలేదని ఐసీసీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments