Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ప్రపంచంలో అద్భుతం : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన గెలుపు

క్రికెట్ ప్రపంచంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మ‌ట్టిక‌రిపించింది.

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (13:54 IST)
క్రికెట్ ప్రపంచంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మ‌ట్టిక‌రిపించింది. చివ‌రివ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో కంగారూల‌ను బంగ్లాదేశ్ కుర్రోళ్ళు చిత్తు చేశారు.
 
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హ‌స‌న్ మ్యాచ్‌లో ప‌ది వికెట్లు తీసి బంగ్లా గెలుపులో కీల‌క‌పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన ష‌కీబ్‌.. ఆసీస్‌కు షాకిచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 260 ర‌న్స్ చేయ‌గా ఆస్ట్రేలియా 217 ప‌రుగుల‌కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో 221 ర‌న్స్ చేసిన బంగ్లా.. ఆసీస్‌కు 265 ర‌న్స్ టార్గెట్ ఇచ్చింది. 
 
అయితే, లక్ష్య ఛేదనలో కంగారులు కంగారుపడ్డారు. ఆ జట్టు ఓపెన‌ర్ వార్న‌ర్ (112) మెరుపు సెంచ‌రీ చేసినప్పటికీ మిగ‌తా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో దీంతో 244 ప‌రుగుల‌కే ఆస్ట్రేలియా ఆలౌటైంది. చివ‌రి 7 వికెట్ల‌ను కేవ‌లం 73 ప‌రుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. 
 
అంతకుముందు ఓవ‌ర్‌నైట్ స్కోరు 2 వికెట్ల‌కు 109 ర‌న్స్‌తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్‌.. గెలిచేలా క‌నిపించినా చివ‌రికి ఓట‌మి త‌ప్ప‌లేదు. టెస్ట్ క్రికెట్‌లో బంగ్లాకిది కేవ‌లం ప‌దో విజ‌యం. కంగారూల‌పై ఆ టీమ్‌కిదే తొలి విజ‌యం. దీంతో టెస్ట్ క్రికెట్‌లో రెండు రోజుల్లో రెండు సంచ‌ల‌న విజ‌యాలు న‌మోద‌య్యాయి. 
 
అలాగే, ఇంగ్లండ్‌పై 322 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని వెస్టిండీస్ అనూహ్యంగా ఛేదించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కంగారూల‌కే బంగ్లా చెక్ పెట్టి టెస్టుల్లోని మ‌జాను అభిమానుల‌కు అందించింది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యం సంపాదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments