Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో పీసీబీ.. నాలుగు నెలులుగా క్రికెటర్లకు జీతాల్లేవ్...

ఠాగూర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (09:49 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత నాలుగు నెలలుగా ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఫలితంగా గత నాలుగు నెలలుగా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. నిజానికి గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనల్లో ఘోరంగా విఫలమవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆ దేశ క్రికెట్ జట్టుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం పీసీబీ కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తుండడం అనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.
 
అయితే, ఇప్పుడు పీసీబీ గురించి కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్థాన్ జాతీయ మీడియా కథనాల మేరకు.. పాక్ క్రికెటర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లు తమ నాలుగు నెలల జీతం ఇంకా అందుకోలేదు. పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు కూడా నాలుగు నెలల జీతం బకాయి ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
 
మొత్తం 25 మంది సీనియర్ పురుషుల క్రికెటర్లకు జులై 1, 2023 నుండి జూన్ 30, 2026 వరకు మూడేళ్ల కాంట్రాక్టులు లభించాయి. అయితే, జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కాంట్రాక్టులపై సమీక్ష జరిగిందని క్రికెట్ పాకిస్థాన్ నివేదిక పేర్కొంది. 'గతేడాది వన్డే ప్రపంచ కప్‌కు ముందు కాంట్రాక్ట్ కోసం ఆటగాళ్లు బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. జులై నుండి అక్టోబరు వరకు నాలుగు నెలల పాటు వారి నెలవారీ జీతాలు అందలేదు' అని నివేదిక పేర్కొంది.
 
మరోవైపు ఆగస్టు 21, 2023 నుండి 23 నెలల కాంట్రాక్టుపై ఉన్న మహిళా జట్టు ఆటగాల్లకు గత నాలుగు నెలలుగా ఇంకా వేతనాలు చెల్లించలేదని క్రిక్‌బజ్ నివేదిక పేర్కొంది. వారి ఒప్పందాన్ని 12 నెలల తర్వాత సమీక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై బోర్డు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments