పొట్టి క్రికెట్‌లో సంచలనం.. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును నమోదుచేసింది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (16:48 IST)
పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును నమోదుచేసింది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల తేడాతో ఆ జట్టుపై విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో 24 బంతుల్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 59 పరుగులు చేయగా, షార్ట్ 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 
 
వీరిద్దరూ ఔట్ అయ్యాక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా ధాటిగా ఆడారు. క్రిస్ లిన్ 13 బంతుల్లో 18, మాక్స్‌వెల్ 14 బంతుల్లో 31, ఫించ్ 14 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ కాగా.. స్టోయినిస్ 5 బంతుల్లో 4, అలెక్స్ కారే ఒక బంతి ఆడి ఒక పరుగు తీసి నాటౌట్‌గా నిలిచి మరో 7 బంతులు మిగిలి ఉండగానే, ఆస్ట్రేలియాను విజయ తీరానికి చేర్చారు. 
 
ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు అదనంగా 20 పరుగులు ఇవ్వడం గమనార్హం. దీంతో 245/5 (18.5 ఓవర్లలో) పరుగులు చేయగలిగింది. 44 బంతుల్లో 76 పరుగులు చేసిన షార్ట్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. భారీ విజయలక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలివుండగానే కివీస్ ఛేదించడం ప్రపంచ రికార్డుగా నమోదైంది. 

ఇప్పటివరకు 232 పరుగుల లక్ష్యసాధనే ప్రపంచ రికార్డుగా ఉండేది. దీన్ని ఆస్ట్రేలియా బ్రేక్ చేసింది. 2018లో సౌతాఫ్రికా నిర్ధేశించిన 232 టార్గెట్‌ను వెస్టిండీస్ ఆటగాళ్లు 6 వికెట్లను కోల్పోయి 236 పరుగులు చేశారు. అలాగే, 2016లో సౌతాఫ్రికా (230)పై ఇంగ్లండ్ (230/8) విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments