అండర్-19 వరల్డ్ కప్ : భారత్ ముంగిట 217 పరుగుల టార్గెట్
అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు సాగుతోంది. ఇందులోభాగంగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తుది పోరు సాగుతోంది. ఇందులోభాగంగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత యువ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ ఆటగాళ్లు పరుగులు చేసేందుకు కంగారు పడిపోయారు.
ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడినా.. స్పిన్నర్లు దిగిన తర్వాత సీన్ మారిపోయింది. ఇషాన్ పోరెల్, నగర్‌కోటి, అనుకూల్‌రాయ్, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక దశలో 134 పరుగులకే 3 వికెట్లతో ఉన్న ఆసీస్.. 82 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివరి పది ఓవర్లలో ఆసీస్‌ను భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు.
ఇప్పటికే మూడేసి సార్లు వరల్డ్‌కప్ గెలిచిన ఇండియా, ఆస్ట్రేలియా.. ఇప్పుడు రికార్డు స్థాయిలో నాలుగో వరల్డ్‌కప్‌పై కన్నేశాయి. శుభ్‌మాన్ గిల్, పృథ్విషా, మన్‌జోత్ కల్రాలతో కూడిన పటిష్ట టాపార్డర్ ఈ లక్ష్యాన్ని సునాయాసంగా చేదించే అవకాశాలు ఉన్నాయి. భారత యువ జట్టుకు క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న విషయం తెల్సిందే.