Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు మ్యాచ్‌ల టిక్కెట్లు ఒక్కరోజే ఖాళీ! (video)

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (14:35 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇటీవల యూఏఈ గడ్డపై జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ముగిసిన వెంటనే అక్కడ నుంచి అటే సిడ్నీ నగరంలో కాలుమోపింది. ప్రస్తుతం కోవిడ్ మార్గదర్శకాల మేరకు 14 రోజుల క్వారంటైన్‌లో భారత క్రికెట్ జట్టు ఉంది. 
 
అయితే, ఈ పర్యటనలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు ట్వంటీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత వన్డే సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 
 
అయితే, ఈ రెండు జట్ల పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లు శుక్రవారం అమ్మకానికి ఉంచగా తొలిరోజే అదిరిపోయే స్పందన వచ్చింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల టికెట్లను విక్రయానికి పెట్టగా, 5 మ్యాచ్‌ల టికెట్లు తొలిరోజే అమ్ముడయ్యాయి. 
 
అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తొలి వన్డేకు సంబంధించి 2 వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్‌నే అనుమతిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments