Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి అంబటి రాయుడు.. టీడీపీలోకి వస్తారా.. వైకాపాలోకి వెళ్తారా..?

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (10:27 IST)
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో రానున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లోకి వస్తానని అంబటి రాయుడు ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు అంబటి రాయుడి స్వగ్రాం. అయితే తండ్రి హైదరాబాదులో స్థిరపడటంతో అక్కడే క్రికెట్ నేర్చుకున్నాడు. 
 
జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రికెటర్‌గా ఎదిగాడు. కానీ క్రికెట్‌లో మెరుగైన ఆటగాడిగా రాణించలేకపోయాడు. త్వరలో రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నట్లు అంబటి రాయుడు ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల్లోని వైకాపా, టీడీపీతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. 
 
ఇక అంబటి రాయుడు తాత టీడీపీ తరపున గెలిచి సర్పంచ్‌గా పనిచేసారు. ఇప్పటికే గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లతో అధిష్ఠానం మంతనాలు జరిపిందని తెలుస్తోంది. కానీ రెండు మూడుసార్లు సీఎం జగన్‌ను ప్రశంసల్లో ముంచెత్తడంతో రాయుడు వైసీపీలోకి వెళ్తారని టాక్ వస్తోంది. 
 
వైకాపా నేతలు రంగంలోకి దిగి గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అంబటికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అంబటి ఏ పార్టీలో చేరుతారనేది ఆయన ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments