ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వున్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు.
ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించారు. ఈ మహా యజ్ఞంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఈ మహాయజ్ఞం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో వేదపండితుల సూచన మేరకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో సీఎం జగన్ పాల్గొన్నారు.