Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎల్ రాహుల్ లవర్‌తో చిక్కాడు.. తండ్రి అయిన రహానే

Webdunia
సోమవారం, 7 అక్టోబరు 2019 (17:53 IST)
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ నటి అతియా శెట్టితో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని నిజం చేస్తూ.. ఈ జంట కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌కు వీరిద్దరూ డిన్నర్ డేట్‌కు వచ్చారు. 
 
రాహుల్, అతియాలతో పాటు బాలీవుడ్ నటుడు పంచోలీ, ఆకాంక్షల జంట కూడా కనిపించింది. కాగా, తమ మధ్య ఉన్న సంబంధంపై ఇప్పటివరకూ అటు రాహుల్ గానీ, ఇటు అదియాలు గానీ ఇంతవరకూ నోరు విప్పలేదు. 
 
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్, గతంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌లతోనూ చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్, అతియాల జోడీ కూడా కెమెరాకు చిక్కడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తండ్రయ్యాడు. రహానే అర్ధాంగి రాధిక శనివారం నాడు పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ సమయంలో రహానే విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. తమ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం పట్ల రహానే, రాధిక ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో, తన కుమార్తెను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫొటోను రహానే సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments